భోజ్‌పురి నటి అనుపమ పాఠక్‌ ఆత్మహత్య
భోజ్‌పురి నటీ అనుపమ పాఠక్‌ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొంది. అనుపమ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు సమాచారం. 40 సంవత్సరాల ఈ నటి ఈనెల 2న తన ఫేస్‌బుక్‌లో మాట్లాడుతూ ఈకాలంలో ఎవరిని నమ్మకూడదని, మోసం చేసిన వ్యక్తుల గురించి, తన బాధల గురించి చెప్పుకుంది. ఆమె నివాసంలో సూసైడ్‌ నోట్‌ కూడా స్వాధీనం చేసున్నారు. అనుపమ ఆత్మహత్య చేసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పింది. తన స్నేహితుడి అభ్యర్ధన మేరకు మాలాడ్‌లోని విజ్‌డమ్‌ ప్రొడ్యూసర్ కంపెనీలో కొంత మొత్తం పెట్టుబడి పెట్టింది. అయితే పెట్టుబడి 2019లోనే తిరిగి రావాల్సి ఉండంగా సంస్థలోని వాళ్లు ఆమె పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదట. ఆ తరువాత కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్‌ సమయంలో మరో వ్యక్తి ఆమె టూవీల్లర్‌ బండిని తీసుకుని ఇవ్వలేదట. మొత్తం మీద ఈ రోజు బాలీవుడ్‌లో రెండు విషాద సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి వెండితెర బుల్లితెర నటుడు సమీర్‌ శర్మ కాగా ఇప్పుడు భోజ్‌పురి నటి అనుపమ పాఠక్‌.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.