బోయపాటి కోసం బాలయ్య కసరత్తులు

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనులది విజయవంతమైన జోడీ. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు నందమూరి అభిమానులకు బాగా నచ్చేశాయి. ఈ రెండు చిత్రాలలోనూ బాలయ్య సరికొత్తగా కనిపించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం పట్టాలెక్కనుంది. బాలకృష్ణ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈలోగా బాలయ్య కాస్త స్లిమ్‌గా మారే పనిలో పడ్డారు. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం పాత్రకు లోబడి బరువు పెరిగిన బాలయ్య... బోయపాటి కోసం దాదాపు 20 కిలోల బరువు తగ్గేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని, ఆ రెండు పాత్రలలోనూ వైవిధ్యం చూపించడానికి కొన్ని ప్రత్యేక గెటప్పులు ప్రయత్నించనున్నారని తెలుస్తోంది. మరోవైపు స్క్రిప్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కథానాయికల ఎంపికపైనా చిత్రబృందం దృష్టి పెట్టింది. 2020 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలన్నది బాలయ్య ఆలోచన.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.