బ్ర‌హ్మానందంకి జ‌రిగింది బైపాస్ ఆప‌రేష‌న్ కాదా..?
ఇటీవ‌ల బ్ర‌హ్మానందం పేరు సోష‌ల్ మీడియాలో మార్మోగిపోయింది. ఆయ‌న ఆరోగ్యం మంద‌గించ‌డం, ముంబైలో బైపాస్ ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌డం.. ఆయ‌న అభిమానుల్ని ఆందోళ‌న‌లో ముంచేశాయి. ఆ త‌ర‌వాత బ్ర‌హ్మానందం ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆప‌రేష‌న్ త‌ర‌వాత కూడా బ్ర‌హ్మానందం ముంబైలో ఉండిపోవ‌డంతో ఆందోళ‌న మ‌రింత ఎక్కువైంది. ఎట్ట‌కేల‌కు బ్ర‌హ్మానందం ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేశారు. ఇప్పుడు కులాసాగానే ఉన్నారు.


అయితే బ్ర‌హ్మానందంకి బైపాస్ జ‌ర‌గ‌లేద‌ట‌. అలాంటిదే గుండెకు సంబంధించిన ఓ ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న‌కు గుండెల్లో నొప్పిగా అనిపిస్తే హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స చేయించుకున్నారు. నిపుణుల స‌ల‌హాతో.. ముంబైలో శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నారు. దాంతో బ్ర‌హ్మీకి బైపాస్ జ‌రిగింద‌ని వార్త‌లొచ్చాయి. బ్ర‌హ్మానందం ఆరోగ్యం కుదుట‌ప‌డి హైద‌రాబాద్ చేరుకున్నాక ప‌రామ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. మోహ‌న్‌బాబు ఇటీవ‌లే ఆయ‌న్ని క‌లిసి వ‌చ్చారు. బ‌న్నీ కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కుటుంబం కూడా బ్ర‌హ్మానందంని ప‌రామ‌ర్శి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించిన ఫొటోలేం బ‌య‌ట‌కు రాలేదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.