తమిళ్‌లోకి శ్రీ విష్ణు చిత్రం?

తెలుగులో సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న చిత్రాలు తమిళ్‌లో రీమేక్‌ అవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జాబితాలో యువ కథానాయకుడు శ్రీ విష్ణు చిత్రం ఒకటి తమిళ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అవుతుందని టాలీవుడ్‌ టాక్‌. అదే సినిమా అంటే? బ్రోచేవారెరురా. విష్ణు, నివేదా థామస్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వివేక్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. సరికొత్త కథనంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాడు దర్శకుడు. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించిన ఈ చిత్ర తమిళ రీమేక్‌ హక్కులు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందట. అన్ని వర్గాల వారికి నచ్చే కథ కావడంతో భారీ ధరకు హక్కులు తీసుకుని ప్రీ పొడ్రక్షన్ కార్యక్రమాలు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.