హాలీవుడ్‌ హాస్యనటుడు క్లార్‌ రైనర్ ఇకలేరు

ప్రముఖ హాలీవుడ్‌ హాస్యనటుడు, దర్శకుడు క్లార్‌ రైనర్‌ కన్నుమూశారు. జూన్‌ 29న తన 98 సంవత్సరాల వయసులో కాలిఫోర్నియాలోని బ్రేవర్లీ హిల్స్ కన్నుమూశారు. తొమ్మిది ఎమ్నీ అవార్డుల గెల్చుకున్న కార్ల్ లైనర్‌ యువర్‌ షో ఆఫ్‌ షోష్‌ సీరీస్‌లో బుల్లితెర నటుడుగా ప్రస్థానం పొందిన హ్యాపీ యానివర్సరీ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో హాస్యనటుడిగా రాణించారు. దర్శకుడిగా ఆయన ఎంటర్ లాఫింగ్‌, 'ఓహ్ గాడ్,' 'ది జెర్క్',‘ ఆల్ ఆఫ్ మీ’, వన్‌ అండ్‌ ఓన్లీ, దట్‌ ఓల్డ్ ఫీలింగ్‌ లాంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాయే లోకంగా బతికిన కార్ల్ గత ఏడాది టాయ్‌ స్టోరీ 4 చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అంతేకాదు తనతో పాటు హాలీవుడ్‌లో పనిచేసిన నటీనటులతో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా అభిప్రాయాలను పంచుకొనేవాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.