‘ఆచార్య’ తరువాత మెహర్ రమేష్‌ చిత్రంపై చిరు మొగ్గు చూపుతున్నారా!

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’‌ చిత్రంలోనూ, తమిళంలో వచ్చిన ‘వేదాళం’ చిత్రాన్ని కూడా తెలుగులో తెరకెక్కించనున్నారు. తొలుత ‘లూసిఫర్’‌ చిత్రానికి దర్శకుడిగా ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించిన  సుజీత్‌రెడ్డిని అనుకోగా అతను ఈ ప్రాజెక్టు కొన్నికారణాల వల్ల తప్పుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని వి.వి.వినాయక్‌ చేపట్టారు. అంతేకాదు ఆ చిత్ర  స్ర్కిప్టును తెలుగుదనానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ‘వేదాళం’ చిత్ర కథను ఇప్పటికే దర్శకుడు మెహర్‌ రమేష్‌ చిరుకి వినిపించాడట. స్ర్కిప్టు విన్న చిరు కథలో ఎటువంటి మార్పులు చేయకుండానే తన సంతృప్తిని తెలియజేశాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తం మీద కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ పూర్తవ్యవగానే మోహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించే చిత్రమే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.