ఏడు ఎకరాల సెట్లో చిరంజీవి - నయనతార డ్యాన్స్

చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆ తరువాత వికారాబాద్‌ అడవుల్లో వారం రోజుల పాటు మరో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుతారట. అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఏడు ఎకరాల్లో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో చిరు, తమన్నాతో ఓ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ పాటతో సినిమాకు ముగింపు అవుతుందని తెలుస్తోంది. ఇందులో నయనతార నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నటిస్తుండగా, తమన్నా ఓ యువరాణి పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు అనుష్కను కూడా ఓ కీలక పాత్రకు ఎంపికచేశారు. అనుష్క కనిపించేది నాలుగైదు సన్నివేశాల్లోనే అయినా అవి సినిమాకు ఎంతో కీలకమని తెలుస్తోంది. జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.