చిరంజీవి కొత్త చిత్రంలో త్రిష?

‘సైరా’ చిత్రం తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సినిమా ప్రారంభం కూడా జరిగింది. అయితే ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై చాలా వార్తలే వస్తున్నాయి. నటి త్రిషను ఇందులో కథానాయికగా తీసుకోనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే ఈ చిత్రం కోసం త్రిషను సంప్రదించే పనిలో ఉన్నారట. చిరంజీవి సరసన నటించడం త్రిషకి కొత్తేం కాదు. గతంలో ‘స్టాలిన్‌’ చిత్రం కలిసి పనిచేసింది. అందులో చిరంజీవి త్రిషను ఆటపట్టించే సన్నివేశాలు ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంటాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో ‘రంగి’ ‘షుగర్‌’ చిత్రాల్లో నటిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.