చిరు 152లో... డబుల్‌ ధమాకా!

టీవలే ‘సైరా’కి గుమ్మడికాయ కొట్టేశారు. తన పాత్రకు చిరంజీవి డబ్బింగ్‌ చెప్పడం కూడా మొదలెట్టేశారు. నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకుని అక్టోబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా చిరు తన 152వ చిత్రాన్నీ సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సంసిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాత. జులై మొదటి వారంలో మొదలు కానుంది. ఇందుకోసం కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ సెట్‌ని తీర్చుదిద్దుతున్నారు. అక్కడే తొలి షెడ్యూల్‌ మొదలు కానుంది. చిరు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో నయనతారని కథానాయికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.