65 ఏళ్లు దాటిన నటీనటులు షూటింగ్‌లో పాల్గొనవచ్చు!

ప్రపంచంలో కరోనా వైరస్‌ (కోవిడ్- 19) వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి. కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. ఇందులో సినీరంగం కూడా ఉంది. కరోనా వైరస్‌ కొనాసాగుతున్న కారణంగా 65 సంవత్సరాలు పైబడిన నటీనటులు సినిమా-టీవీ సీరియల్స్ షూటింగ్‌లో పాల్గొన కూడదని మహారాష్ర్ట ప్రభుత్వం మార్గదర్శకాలు జారిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై బాలీవుడ్‌కి చెందిన సీనియర్‌ నటుడు ప్రమోద్‌ పాండే జులై 21న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కొట్టివేస్తూ , 65 సంవత్సరాలు పైబడిన నటీనటులు షూటింగ్‌లో తిరిగి పాల్గొనవచ్చునని అనుమతి ఇచ్చింది. అయితే ఓ పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.