వెంకీ... కుటుంబంతో!

కుటుంబ అనుబంధాలతో ముడిప‌డిన క‌థ‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోతుంటారు వెంక‌టేష్‌. అందుకే ఆయ‌న సినిమాల‌న‌గానే ఇంటిల్లిపాదీ క‌లిసి చూడ‌టానికి సిద్ధ‌మ‌వుతుంటారు. ఆయ‌న సినిమాల పోస్ట‌ర్లు సైతం అనుబంధాల‌కి అద్దం ప‌డుతుంటాయి. సినిమాల్లోనే కాదు... నిజ జీవితంలోనూ కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌మిస్తుంటారు వెంక‌టేష్‌. చిత్రీక‌ర‌ణ లేదంటే ఆయ‌న కాల్షీట్ల‌న్నీ కుటుంబానికే. వెంకీ త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఎంత సందడిగా గ‌డుపుతుంటారో ఈ ఫొటోనే చెబుతోంది. ఆయ‌న శ్రీమ‌తి, ముగ్గురు కుమార్తెలు, అన్న డి.సురేష్‌బాబు కూతురు, మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య భార్య స‌మంత‌తోనూ క‌లిసి ఉన్న ఫొటో ఇది. ఇటీవ‌లే వెంకీ కుమార్తె పెళ్లి వేడుక జ‌రిగింది. ఆ సందర్భంగానే ఈ ఫొటో తీశారేమో. చూస్తుంటే సంక్రాంతి సినిమా గుర్తుకొస్తోంది క‌దూ!

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.