ఎన్‌కౌంటర్‌ చేస్తానంటున్న రజనీకాంత్‌

రజనీకాంత్‌ - ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలోనటిస్తున్న చిత్రం ‘దర్బార్‌’. ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి పోలీసు అధికారి పాత్ర కాగా, మరొకటి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఓ సన్నివేశాన్ని కూడా ఇటీవల తెరకెక్కించారట. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారుఉ. ఈ నెల చివరకు తొలిషెడ్యూల్‌ పూర్తికానుందని తెలుస్తోంది. తరువాత తర్వాత కొంత విరామం తీసుకుని రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. రజనీకాంత్‌ ‘పేట’ చిత్రం తరువాత చేస్తున్న చిత్రం ఇదే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.