నాగ్‌ సరసన అందాల సుందరి?

ప్రస్తుతం నాగార్జున, ఆశిషోర్‌ సాల్మోన్‌ దర్శకత్వంలో ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగ్‌ సరసన అందాల సుందరి దియా మీర్జా నటించనుందని సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంలో నాగార్జున నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారి విజయ్‌ వర్మగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. దియా హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగిన అమ్మాయి. తమిళ్లో అరవింద్‌ స్వామి సరసన ‘ఎన్‌ స్వాసా కాట్రే’ చిత్రంలో అతిథి పాత్రతో వెండితెర ప్రవేశం చేసింది. ఆ తరువాత ఎక్కువ చిత్రాలు హిందీలోనే చేసింది. మధ్యలో బుల్లితెరపై ‘గంగా - ది సౌల్‌ ఆఫ్‌ ఇండియా’ను కనిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన చివరి చిత్రం ‘సంజు’ ఈ చిత్రంలో మాన్యతా దత్‌గా నటించింది. గత ఏడాది ‘కాఫిర్‌’, ‘మైండ మల్హోత్రాస్‌’, ‘మొఘల్స్‌’లాంటి వెబ్‌సీరీస్‌లోనూ చేసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.