చైతూతో దిల్‌ రాజు, బోనీ కపూర్‌ రీమేక్‌ ప్లాన్‌?
టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో దిల్‌ రాజు ఒకరు. బాలీవుడ్‌లో పేరున్న వారిలో బోనీ కపూర్‌ మరొకరు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఊహల్లోనే ఆసక్తి రేపే కాంబినేషన్‌ ఇది. తెలుగులో విజయం సాధించిన ‘ఎఫ్‌ 2’ను బాలీవుడ్‌లో వీరిద్దరూ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇది తెలిసిన విషయమే. హిందీలో హిట్‌ అయిన ఓ సినిమాను ఈ కాంబో తెలుగులో తెరకెక్కించనుందని తాజా సమాచారం. 2018లో విడుదలైన ‘బదాయి హో’ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించేందుకు దిల్‌ రాజు, బోనీ రీమేక్‌ హక్కులు సైతం దక్కించుకున్నారట. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడుగా అమిత్ శర్మ తెరకెక్కించారు. తెలుగు రీమేక్‌లో హీరో పాత్ర కోసం నాగ చైతన్యను ఎంపిక చేయనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీమామ’ చిత్రంతో బిబీగా ఉన్నాడు. తాజాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇవి పూర్తయ్యాక ఈ క్రేజీ ప్రాజెక్టు చేస్తాడేమో చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.