కరోనాతో మరణించిన హాలీవుడ్‌ నటుడు

ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్‌ కార్డెరో కన్నుమూశారు. గత కొంతకాలంగా కోవిడ్‌-19తో బాధపడుతున్న నిక్‌ కార్డెరో లాస్‌ఏంజల్స్ లోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో జులై 5న కన్నుమూశారు. 41 సంవత్సరాల నిక్‌ గత 90 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఇలా మరణించారు. ఆయన వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా నటించి అలరించారు. ఆయన బుల్లితెరపై బ్రాడేవేల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. టోనీ అవార్డును పొందాడు. ‘ఏ స్టాండ్‌ అప్‌ గయ్‌’, ‘గోయింగ్‌ ఆన్‌ స్టైయిల్’‌, ‘ఇన్‌సైడ్‌ గేమ్’‌, ‘మాబ్‌ టౌన్’‌ లాంటి చిత్రాల్లోనూ నటించి మెప్పంచారు. ఆయనకు భార్య క్లూట్స్, 1 సంవత్సరం వయసున్న కుమారుడు ఎల్విస్‌ ఉన్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.