హాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఎన్నియో మోరికోన్‌ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్‌ ఇటాలియన్‌ సంగీత దర్శకుడు ఎన్నియో మోరికోన్‌ ఇకలేరు. ఎముక విరిగిపోవడంతో కొన్ని రోజుల కిత్రం ఆసుపత్రిలో చేరాడు. ఈరోజు  ఆయన మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. నవంబర్‌ 10, 1928లో జన్మించిన ఈయన దాదాపు 500 చిత్రాలకు పైగా పనిచేశాడు. గోల్డెన్‌ గ్లోబ్‌, గ్రామీ, బాఫ్తా సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1966లో సెర్గియో లియోన్ దర్శకత్వంలోవచ్చిన ‘ది గుడ్‌ అండ్‌ ది బ్యాడ్‌ ది అగ్లీ’ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో క్లింట్ ఈస్ట్‌ఉడ్‌, ఎలి వాలచ్‌లు నటించారు. ఇంకా ‘ది థింగ్‌’, ‘ది మిషన్’‌, ‘ది అన్‌టచ్‌బుల్స్’, ‘మిషన్‌ టు మార్స్’, ‘ఇన్‌ ది లైన్‌ ఆఫ్‌ ఫైర్’‌, ‘ది హేట్‌ఫుల్ ఎయిట్‌’ అనేక చిత్రాలకు సంగీతం అందించాడు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సంగీత దర్శకులకు మార్గదర్శకం చేశారు. ఆయన మరణం చిత్రసీమకు ఎనలేని లోటు అని హాలీవుడ్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన సినీ ప్రముఖులు  నివాళులు అర్పించారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.