‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత సత్యదేవ్ - దర్శకుడు గోపి గణేష్ పట్టాభి కలిసి చేస్తున్న చిత్రం ‘గాడ్సే’. సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా ఎంపికైంది. మలయాళంతోపాటు తమిళంలోనూ నటించిన ఆమెకి తెలుగులో ఇదే తొలి చిత్రం.‘‘సత్యదేవ్ ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రని పోషిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి నటనకి ప్రాధాన్యమున్న పాత్రలో సందడి చేయనుంద’’ని చెప్పాయి చిత్ర వర్గాలు. మరోవైపు ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరుసు’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు సత్యదేవ్.