ముచ్చటగా మూడోసారి?

గోపీచంద్‌, అనుష్క శెట్టి చూడముచ్చటైన జంట. ‘‍లక్ష్యం’, ‘శౌర్యం’తో అలరించిన ఈ జోడీ మరోసారి కనువిందు చేయబోతుందని సినీ వర్గాల సమాచారం. ప్రముఖ దర్శకుడు తేజ ‘అలిమేలుమంగ వేంకటరమణ’ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన నటించేందుకు కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడా స్థానంలో అనుష్కని తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాయిక పాత్ర కీలకం కావడంతో స్వీటీని సంప్రదించారని టాక్‌. చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే స్పష్టత రావచ్చని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అనుష్క ఓకే చెప్తుందా, లేదా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా గోపీచంద్‌- అనుష్క కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఇటీవలే విడుదలై మంచి స్పందన అందుకుంది. గోపీచంద్‌ ‘సీటీమార్‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా నాయిక. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.