గోపీచంద్‌కి మ‌రో అబ్బాయి పుట్టాడు
క‌థానాయ‌కుడు గోపీచంద్ ఇంట వినాయ‌క చ‌వితి సంబ‌రాలు రెట్టింపయ్యాయి. మ‌రోసారి ఆయ‌న పుత్రోత్సాహంతో పొంగిపోయారు. గోపీచంద్ స‌తీమ‌ణి రేష్మి గురువారం ఉద‌యం 5 గంట‌ల 40 నిమిషాల‌కి ఓ పండంటి మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు. ఇదివ‌ర‌కే గోపీచంద్, రేష్మి దంప‌తుల‌కి విరాట్‌కృష్ణ అనే ఓ అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు వారింట మ‌రో బాబు సంద‌డి మొద‌లైంద‌న్న‌మాట‌. గోపీచంద్ స‌తీమ‌ణి రేష్మి ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు శ్రీకాంత్‌కి స్వ‌యానా మేన‌కోడ‌లు. ప్ర‌స్తుతం గోపీచంద్ కొత్త చిత్రం కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు గోపీచంద్‌. కుమార్ అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు వినూత్న‌మైన ప్రేమ‌క‌థ‌తో ఆ చిత్రం తెర‌కెక్కించ‌బోతున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.