అల్లు చిత్రంలో ‘దేశముదురు’ భామ

హన్సిక అంటే మనకు టక్కున గుర్తొచ్చేది ‘దేశముదరు’ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ - బన్నీల కాంబినేషన్‌లో వస్తున సినిమాలో హన్సిక ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ఇందులో హన్సిక ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో పోషించనుందట. పూజాహెగ్డే కథానాయికగా నటించగా, మలయాళ నటుడు జయరామ్‌ సుబ్రమణియ్, టుబులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘దేశముదురు’ చిత్రం తరువాత బన్నీతో కలిసి నటించే చిత్రం ఇదే కావడం విశేషం. ఈ మధ్య కాలంలో తెలుగులో బాలకృష్ణ నటించిన ‘కథానాయకుడు’ చిత్రంలో జయప్రదగా అలరిచింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.