‘భారతీయుడు’ ఆలస్యం?

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ కమల్‌ హాసన్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతుంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడబోతుందని కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రాంతంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అనంతరం అక్కడి అడవులు, గనుల్లో కొన్ని పోరాట సన్నివేశాలు షూట్‌ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుందని, దీని తర్వాత చెన్నై, గుజరాత్‌ షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ముందుగా ఈ ఏడాది చివరికి ప్రేక్షకుల మ³ందుకు వద్దామనుకున్నా రాలేని పరిస్థితని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందని టాక్‌. 2020 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. భారీ అంచనాల నడుమ వస్తుంది కాబట్టి ఆలస్యమైనా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు తమిళ ప్రేక్షకులు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కాజల్, రకుల్, సిద్దార్థ్, బాబిసింహా, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.