గోవాలోనే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు

మనదేశంలో జరిగే అతిపెద్ద సినిమా వేడుక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ). ఈ వేడుక గోవాలో జరగనుంది. 1952 నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ 51వ వేడుకలు జరగనున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారితో అస్సలు ఈ ఉత్సవాలు జరుగుతాయా లేదా అనే ప్రశ్న కూడా ఓ సందర్భంలో తలెత్తింది. అయితే ఇప్పటికే అంతర్జాతీయం ఏన్నో ఫిల్మ్ వేడుకలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలపై గోవా ముఖ్యమంతి ప్రమోద్‌ సావంత్‌ ఆ మధ్య మాట్లాడుతూ..‘‘అంతర్జాతీయ చలన చిత్రోవత్సవాలను అనుకున్న తేదీలలోనే నిర్వహిస్తాం. అంతేకాదు సమచార, ప్రసారం కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తామని’’ వెల్లడించారు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.