ఎనభైకోట్లు గుంజుకున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’!

రామ్‌ పోతినేని, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఊరమాస్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్‌లు కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఇరవై అయిదు రోజుల్లో సుమారు ఎనభైకోట్ల రూపాయలను వసూళు చేసిందట. విడుదలైన ప్రతి సెంటర్లోను మాస్‌ ప్రేక్షకులతో హాళ్లని నిండాయని. అందుకే ఈ వరదలాంటి వసూళ్లు సాధ్యమయ్యాని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. హీరో రామ్‌ సినిమా చరిత్రలోనే అధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోతుంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీప్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం జులై 18, 2019న ప్రేక్షకుల మందుకొచ్చింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.