చిరంజీవి రీమేక్‌ చిత్రంలో జగపతిబాబు?


జగపతిబాబు పేరు వింటేనే మనకు గుర్తుకొచ్చేది ఆయన నటించిన కటుంబ కథా చిత్రాలు. అలాంటి వాటిలో ‘శుభలగ్నం’, ‘మావిడాకులు’, ‘సర్దుకుపోదాం రండి’ లాంటి అనేక చిత్రాలు ఉన్నాయి. ఇద్దరు పెళ్లాల మధ్య నలిగిపోయే భర్తగా, పెళ్లాం మాట కాదనలేక ఆమె చెప్పిన అమ్మాయికి భర్తగా మారడం. ఇలా ఎన్నో ఉన్నాయి. మలయాళంలో వచ్చిన లూసిఫర్‌ చిత్రం తెలుగులో రీమేక్‌గా తెరకెక్కనుంది. ఇందులో కథానాయకుడిగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్నారు. ‘సాహో’ దర్శకుడు సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో ఎంపిక చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ‘లూసీఫర్’‌ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టాక పలు కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.