మరోసారి వెబ్‌సీరీస్‌లో అడుగుపెట్టనున్న జగపతిబాబు!

తెలుగు చిత్రసీమలో కుటంబ చిత్రాల హీరో అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అలనాటి నటుడు శోభన్‌బాబు. ఆ తరువాత ఈ స్థానాన్ని హీరో జగపతిబాబు ఆక్రమించారు. త్వరలోనే జగపతిబాబు ఓ వెబ్‌సీరీస్‌లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు.  అలనాడు సత్యహరిశ్చంద్రుడు తన అప్పు తీర్చడం కోసం భార్య చంద్రమతిని విక్రయించినట్లు విన్నాం. అదే విధంగా జగపతిబాబు ‘శుభలగ్నం’ చిత్రంలో నటి ఆమని కోటీశ్వరరాలు కావాలనే ఆశతో మొగుడైన జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. రానురాను జగపతి హీరోల పాత్రల నుంచి ప్రతినాయకుడి పాత్రల్లోకి వచ్చేశారు. అలా ‘లెజెండ్’‌ చిత్రంతో ప్రతినాయకుడిగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాంటి జగపతి మారుతున్న ప్రతి దశలోనూ తన సత్తా చాటూతూ వచ్చారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పుడు అందరికి బాగా సుపరిచతమైన మాటలు వెబ్‌సీరీస్‌ చిత్రాలు, ఓటీటీలాంటి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో డిజిటల్‌ వేదికల వాహ నడుస్తోందని చెప్పవచ్చు. అందుకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు, నటీనటులు సైతం పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నారు. జగపతిబాబు వెబ్‌సీరీస్‌ చిత్రానికి కొత్తేమి కాదు. గతంలో ఆయన ‘గ్యాంగ్‌స్టర్స్’‌ చిత్రంలో నటించారు. ప్రస్తుతం జగపతిబ నటించబోయో వెబ్‌సీరీస్‌ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణ సంస్థ నిర్మించనుందట. వచ్చేనెల్లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేసినట్లు చెప్పుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా నటనలో ఎప్పటికప్పుడు వైవిధ్యంగా రాణించడం జగపతికే చెల్లింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.