ఆసుపత్రిలో చేరిన అలనాటి నటి జయంతి

తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అలనాటి అగ్రకథానాయకుల సరసన నటించిన నటి జయంతి. ఆమె అసలు పేరు కమల కుమారి. ఆమె తీవ్రమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో చేరింది. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) పరీక్ష కూడా చేశారు. ఫలితం నెగటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉందని జయంతి తనయుడు కృష్ణ కుమార్‌ ధృవీకరించారు.  దక్షిణాదిలో చిత్రాల్లో దాదాపు 500 చిత్రాలకు పైగా నటించింది. తెలుగులో ఎన్టీఆర్‌ సరసన ‘కొండవీటి సింహం’, ‘జస్టీస్‌ చౌదరి’ చిత్రాల్లోనే కాక మిగతా తెలుగు హీరోలతోనూ నటించింది. ఇక మోహన్‌బాబు నటించి నిర్మించిన ‘పెదరాయుడు’ చిత్రంలో రజనీకాంత్‌ చెల్లిగా నటించి మెప్పించింది. తమిళంలో యమ్జీఆర్, శివాజీ గణేశన్‌, జైశంకర్, కన్నడ నటుడు నాగేష్ నటులతోనూ ఆడిపాడింది. జయంతి  హిందీ - మరాఠీలోనూ చేసింది. 2016 అభి వర్గీస్‌ దర్శకత్వంలో వచ్చిన ఓ ఇంగ్లీష్ షో అయినటువంటి ‘బ్రౌన్‌ నేషన్‌’ చిత్రంలో బాలన్‌ తల్లిగా నటించారు. ఆమె నటనకు గాను అనేక అవార్డులు పొందింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.