తమిళ ‘జెర్సీ’లో విశాల్,అమలా?

యంగ్‌ హీరో నాని నటించిన ‘జెర్సీ’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయం. క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం ప్రశంసలు కురిపించేలా చేసింది. అందుకే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తమిళ్‌ రీమేక్‌లో కథానాయకుడుగా విష్ణు విశాల్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. హీరోయిన్‌ పాత్ర కోసం అమలాపాల్‌ను ఎంపిక చేయనున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. వీరిద్దరూ కలిసి గతంలో ‘రాక్షసన్‌’ చిత్రంలో నటించారు. అంతేకాదు ఈ రీమేక్‌ను నిర్మించేందుకు టాలీవుడ్‌ ప్రముఖ రానా ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ హిందీలోనూ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.