‘కె.జి.ఎఫ్‌2’ కోసం భారీ సెట్స్

కన్నడ నటుడు యష్‌ చేస్తున్న చిత్రం ‘కె.జి.ఎఫ్‌2’. ఈ సీక్వెల్ కోసం చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ సెట్స్ సిద్దం చేస్తున్నారట. ఈ చిత్రం కోసం భారీ తారాగాణాన్ని ఎంపిక చేసుకొన్న సంగతి తెలిసిందే. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం కోలార్ పరిసరాల్లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. వీటి కోసం సుమారు మూడు వందల యాభైమంది ఏకధాటిగా పనిచేస్తున్నారట. ఈ స్థాయిలో సెట్టింగ్‌ పనులు చేస్తుండడంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నుంచి సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌లు నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.