సూర్య కాఖా కాఖా చిత్రానికి సీక్వెల్‌ రానుందా?

తమిళ నటుడు సూర్య - జ్యోతిక నటించిన హిట్ చిత్రం ‘కాఖా కాఖా’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమానికి కలైపులి ఎస్‌.థాను నిర్మాత. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ని చేయనున్నట్లు దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఓ పత్రికకి ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. ఈ సందర్భంగా సీక్వెల్‌ చిత్రం గురించి మేనన్‌ మాట్లాడుతూ..‘‘సినిమాకి సంబంధించిన స్ర్కిప్టుని ఇప్పటికే సిద్ధం చేశా. అదీకాక సూర్య తను నటించే పోలీస్‌ పాత్రల సినిమాల మధ్య గ్యాప్‌ కావాలని కోరాడని’’ తెలిపారు. సూర్య 2017లో వచ్చిన ‘సింగం-3’ తరువాత గత ఏడాది వచ్చిన ‘బందోబస్త్’ చిత్రంలోనూ పోలీస్‌ పాత్రలోనే నటించారు. ఆగస్టు 1, 2003లో విడుదలైన ‘కాఖా కాఖా’ సినిమా ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగులో ఈ చిత్రం ‘ఘర్షణ’గా రీమేక్ అయ్యింది. వెంకటేష్‌ - ఆసిన్‌ నాయికానాయకులుగా నటించారు. తెలుగులోనూ ఘనమైన విజయాన్ని నమోదు చేసుకొంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.