కాజ‌ల్‌ని కూడా మార్చ‌బోతున్నాడా?

శంక‌ర్ సినిమా అంటే అందులో అన్నీ ప్ర‌త్యేకమే. క‌థ‌, సాంకేతిక‌త‌, న‌టీనటుల ప్ర‌తిభ‌... ఇలా ఒక‌టి మించి మ‌రొక‌టి తెర‌పై క‌నిపిస్తుంటాయి. ముఖ్యంగా ఆయ‌న సినిమాల్లో న‌టులు అంత‌కుముందు ఎప్పుడూ క‌నిపించ‌ని విధంగా తెర‌పై ద‌ర్శ‌న‌మిస్తుంటారు. చాలా పాత్ర‌లు ప్రాస్థెటిక్ మేక‌ప్‌తో క‌నిపించి ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రుస్తుంటాయి. ఒకొక్క ప్ర‌ధాన పాత్రని రెండు మూడు కోణాల్లో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు శంక‌ర్. అక్క‌డే ఆయ‌న మేజిక్ బ‌య‌ట ప‌డుతుంటుంది. `భార‌తీయుడు2`లోనూ అలాంటి హంగామానే క‌నిపించ‌బోతోంద‌ని స‌మాచారం. ఇందులో విజువ‌ల్ ఎఫెక్ట్స్ కాస్త త‌క్కువే అయినా... న‌టీన‌టుల గెట‌ప్పులు మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఉంటాయ‌ట‌. ఆ విష‌యాన్నే గుర్తుచేస్తూ శంక‌ర్ తాను `2.0` కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డి చేయాల్సిన చిత్ర‌మ‌ని చెప్పారు. ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌బోతున్న కాజ‌ల్ కూడా త‌న సినిమా లైఫ్‌లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రం కాబోతోంద‌ని చెబుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఆమె కూడా ప‌లు గెట‌ప్పులో తెర‌పై క‌నిపించ‌బోతోంద‌ట‌. విదేశీ సాంకేతిక నిపుణులు పెద్ద‌యెత్తున క‌లిసి చేస్తున్న సినిమా ఇద‌నీ కాజ‌ల్ అధికారికంగా వెల్ల‌డించింది. పాత్ర రీత్యా ఆమె కూడా త్వ‌ర‌లోనే త‌న రూపురేఖ‌ల్ని మార్చుకోబోతోంద‌ని, బ‌రువు పెర‌గ‌డంతో పాటు, కొత్త గెట‌ప్పుకి అనుగుణంగా స్టైల్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నెల‌లోనే సినిమాని ప్రారంభిస్తారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.