గోపీచంద్‌ - కాజల్‌.. డబుల్‌ ధమాకా

గోపీచంద్‌ కథానాయకుడిగా బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. నిధి వేట నేపథ్యంలో, ఒక సాహస గాథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కాజల్‌ కథానాయికగా నటించబోతోందని సమాచారం. దీని తర్వాత సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ చేయనున్న మరో చిత్రం కోసం కూడా కాజల్‌ని సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న జోడీ... గోపీచంద్‌ - కాజల్‌. ఇప్పటిదాకా ఒక్క సినిమాలో కూడా కనిపించని ఈ ఇద్దరూ వరుసగా రెండు చిత్రాలతో సందడి చేస్తారో లేదో చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.