చిరు అల్లుడితో ‘రాజుగారి గది3’ అమ్మాయి

చిన్నారి పెళ్లి కూతరుగా పరిచయమైన బుల్లితెర నటి అవికా గోర్‌. చిరంజీవి చిన్నఅల్లుడైన కల్యాణ్‌ దేవ్‌ సరసన కథానాయికగా నటించనుందని సమాచారం. తొలిసారిగా ‘విజేత’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు కల్యాణ్‌ దేవ్‌. ప్రస్తుతం శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో ‘సూపర్‌ మచ్చి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసమే అవికా గోర్‌ని తీసుకోనున్నారని సమాచారం. త్వరలోనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. అవికా తొలుత ‘ఉయ్యాల జంపాలా’ చిత్రంలో నటించి అలరించింది. తరువాత ‘సినిమా చూపిస్తమావ’, ‘రాజుగారి గది3’లోను సందడి చేసింది. ఇప్పటికే అవికా తెలుగు ప్రేక్షకులను తన చిట్టినవ్వుతో కట్టిపడేసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.