అప్పుడు బాలుడిగా ఇప్పుడు యువకుడిగా..!

నందమూరి కల్యాణ్‌ రామ్‌ సతీష్‌ వేగశ్న దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా!'. ప్రస్తుతం ఈ సినిమాలో అలనాటి కథానాయిక సుహాసిని కూడా నటించింది. తాజాగా  కల్యాణ్‌ రామ్‌ ఈటీవీలో అలీతో సరదాగా అనే కార్యక్రమంలో మాట్లాడుతూ..’’నా మొదటి చిత్రం బాబాయి బాలకృష్ణతో కలిసి 'బాల గోపాలుడు' చిత్రంలో నటించాను. ఆ చిత్రంలో కథానాయికగా సుహాసిని నటించింది. మళ్లీ తరువాత ఆమెతో కలిసి ఇప్పటి వరకూ నటించిన సందర్భం లేదు. సుమారు ముఫ్పై సంవత్సరాల తరువాత నేను కథానాయకుడిగా, సుహాసిని ఈ చిత్రంలో క్యారక్టర్‌ నటిగా నటించింది. నేను బాలనటుడిగా నటించిన తరువాత మళ్లీ నేను కథానాయకుడిగా సుహాసిని నా చిత్రంలో నటించడం ఎంతో సంతోషానిచ్చింది. కచ్చితంగా మా సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని.. చెప్పాడు. 





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.