కమల్‌ కొత్త చిత్రంలో ముగ్గురు కథానాయికలు?

ప్రముఖ జాతీయనటుడు కమల్‌హాసన్‌ దర్శకత్వంలో్ తెరకెక్కనున్న చిత్రం ‘ఇలైవన్‌ ఇరుక్కిరన్‌’. గతంలో కమల్‌హాసన్ నటించిన ‘తేవర్‌ మగన్‌’ చిత్రానికి స్వీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని చెప్పుకుంటున్నారు. అప్పట్లో తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’గా అలరించింది. ప్రస్తుతం కమల్‌ ‘ఇండియన్‌2’ చిత్రం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ ఎత్తేయగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా పూరైయిన తరువాత ఈ ఏడాది చివర్లో చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ‘తలైవన్‌ ఇరుక్కిరన్‌’ చిత్రంలో రేవతి, ఆండ్రియా, పూజా కుమార్‌లు నటించనున్నారట. మరో వైపు నటి పూజా కుమార్‌ మాట్లాడుతూ...‘‘ప్రస్తుతానికి ఈ చిత్రంలో నటించడం లేదని’’చెబుతోంది. విజయ్‌ సేతుపతి ఇందులో నాజర్ కొడుకుగా ప్రతినాయకుడి పాత్రలో కనపించనున్నాడు. హాస్యనటుడు వడివేలు కూడా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కర్‌న్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి  ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.