‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ నవంబర్‌లో!


ప్రముఖ జాతీయనటుడు కమల్‌హాస్‌న నటిస్తున్న ‘ఇండియన్’‌ సీక్వెల్‌ చిత్రం ‘ఇండియన్‌ 2’. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌  కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడం‌తో మధ్యలోనే ఆగిపోయింది. ఈ చిత్రం షూటింగ్‌లోనూ అపశృతి చోటుచేసుకొని ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ని నవంబర్‌లో మొదలుపెట్టాలని చిత్రబృందం యోచిస్తుందట. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కమల్‌హాసన్ ఇప్పటికే తమిళనాడులో సొంత రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వచే ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకు షూటింగ్‌ని ముగించుకొని కమల్‌ పూర్తిగా రాజకీయాలవైపు దృష్టిపెట్టానున్నాడట. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌ని షూటింగ్‌ విషయంలో కమల్‌ హాసన్‌ తొందరపెడుతున్నారని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సేనాపతిగా కమల్‌హాసన్‌ లుక్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ లుక్‌లో ఖాకీ డ్రెస్‌ ధరించి ఠీవీగా నుంచోని ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంది. చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ కనిపిస్తోంది. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రంతో కాజల్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌ తదితర నటీనటులు నటిస్తున్నారు. ప్రస్తుతం కమల్‌ తమిళ బిగ్‌బాస్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.