కనికా కపూర్‌కి ఐదోసారి పాజిటీవ్‌

ప్రముఖ గాయని కనికా కపూర్‌ కొన్నాళ్లుగా కరోనా వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. తాజాగా ఐదోసారి కూడా పరీక్ష చేయగా ఇది కూడా పాజిటివ్‌గా తేలింది. ఆమె ఆరోగ్యంపై ఇప్పటికే చాలామంది ఆందోళన చెందుతున్నారు. కనికా ఆరోగ్యం క్షీణించిందని ఐసీయులో ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె ప్రస్తుతం నిలకడగానే ఉందని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్స్‌ డైరక్టర్‌ ఆర్కే ధీమాన్‌ ఇటీవల వెల్లడించారు. కనికా కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘‘మీ అందరి ప్రేమకు దన్యవాదాలు. మీరు, మీకుటుంబ సభ్యులంతా బాగుండాలి. సురక్షితంగా ఉండండి. నేను ఐసీయులో లేను. బాగానే ఉన్నాను. నా తదుపరి పరీక్షలైనా ప్రతికూలంగా వస్తాయని నేను నమ్ముతున్నా’’ అని పేర్కొంది. లండన్‌ నుంచి మార్చి 9న ఇండియాకి వచ్చింది కనికా కపూర్‌. కాన్పూరు, లక్నో తదితర నగరాలను సందర్శించింది. మార్చి 20న కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చేరింది.

View this post on Instagram

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.