హృతిక్‌ సినిమాలో కార్తి?

ఖైదీ’ జీవితంలోని ఒక రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు గడుస్తున్నా ఇంకా చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సినీ అభిమానులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ కార్తీ కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా నమోదవుతోంది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ చిత్ర ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు కార్తి. ప్రచారంలో భాగంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మీకు ఇష్టమైన సినిమాలు ఏవి అంటే గణిత శాస్త్రవేత ఆనంద్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘సూపర్‌ 30’ అంటే చాలా ఇష్టం అని తెలిపాడు. దీన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని కార్తితో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట కొందరు నిర్మాతలు. మరి కార్తి హృతిక్‌ ‘సూపర్‌ 30’ చిత్రాన్ని దక్షిణాదిలోకి తెస్తాడో లేదో తెలియాలంటే మరి కొద్ది కాలం ఎదరుచూడాల్సిందే. కార్తి ఇంతకు ముందు తెలుగు ‘విక్రమార్కుడు’ తమిళ్‌ రీమేక్‌లో నటించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.