డ్రింకర్‌గా మారిన కార్తికేయ!
ర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ ప్రస్తుతం డ్రింకర్‌గా మారాడు. అయితే అది నిజ జీవితంలో కాదండోయ్‌. మరి ఎందుకంటారా? ఆయన నటిస్తున్న కొత్త చిత్రంలో ఆ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘90ఎం.ఎల్‌’ అని ఖరారు చేశారు. యాన్‌ ఆథరైజ్డ్‌ డ్రింకర్‌ అనేది ఉప శీర్షిక. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో మందు సీసాలపై పడుకుని నవ్వుతూ కనిపిస్తుంటాడు కార్తికేయ. ఓ షూ వేసుకుని మరో షూ విప్పేసి.. అన్ని సీసాల మధ్య ఓ రోజా పువ్వును పెట్టుకుని ఉండటంతో ఆసక్తి పెంచేస్తుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్ర బృందమే ఈ చిత్రానికి పనిచేస్తుంది. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్‌ రెడ్డి ఎర్ర. సంగీతం అనూప్‌ రూబెన్స్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.