అధికారి పాత్ర‌లో.
.

కార్తికేయ కథానాయకుడిగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామారెడ్డి నిర్మాత. తాన్య రవిచంద్రన్‌ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకోని సోమవారం ఈ చిత్ర విశేషాల్ని పంచుకుంది చిత్ర బృందం. ‘‘ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో.. కార్తికేయ ఎన్‌.ఐ.ఏ ఆఫీసర్‌గా కనిపిస్తారు. కథ విన్న వెంటనే ఆయన సినిమా చేసేందుకు అంగీకరించడం సంతోషాన్నిచ్చింది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషిస్తున్నార’’ని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.