రజనీతో కీర్తి.. అధికారిక ప్రకటన

రజనీకాంత్‌ హీరోగా తన 168వ చిత్రాన్ని త్వరలోనే శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రంలో కథానాయిక ఎవరనేది తెలియదు. కానీ తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. రజనీ సరసన కీర్తి సురేష్‌ సందడి చేయబోతుందట. తాజాగా ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది కీర్తి. ‘నా జీవితంలో ఇదొక మ్యాజికల్‌ మైల్‌స్టోన్‌. రజనీ సర్‌తో తెర పంచుకునేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. దర్శకుడు శివ, నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్‌కు నా ధన్యవాదాలు’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చింది ఈ నయా మహానటి. ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక మీనా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.  కీర్తి ఇందులో రజనీకాంత్‌ ప్రేమికురాలిగా పాత్ర పోషించనుందట. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మితమయ్యే సినిమాకి డి.ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళి నాటికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘మిస్‌ ఇండియా’, నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ లక్‌ శక్తి’లో చేస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.