‘మహానటి’ దారెటు!

‘మహానటి’ కీర్తి సురేశ్‌కు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సరసన ‘తలైవర్‌168’తో పాటుగా, మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నటించడానికి ఒప్పుకుంది ఆమె. ఇప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒక సినిమాని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఇవి రెండు కూడా ఆమెకు డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ లాంటివే. ఈ రెండు చిత్రాలకు డేట్స్‌ సర్దుబాటు చేయటానికి అన్ని విధాల ప్రయత్నించి చివరికి మణిరత్నం సినిమాను వదులుకోవటానికి సిద్ధపడిందని కోలీవుడ్‌ వర్గాలు చెపుతున్నాయి. ఆమె ఎప్పటి నుంచో సూపర్‌స్టార్‌ సినిమాలో నటించాలనే కోరిక ఉన్నందునే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను వదులుకోవటానికి కారణమని తమిళ వర్గాల మాట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తలైవా168తో పాటుగా ఆమె ‘పెంగ్విన్‌’ అనే నాయికా ప్రాధాన్యమున్న చిత్రంలో నటిస్తున్నారు. దీనికి కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. వీటితో పాటుగా అజయ్‌ దేవగణ్‌ సరసన ‘మైదాన్‌’ చిత్రంతో వచ్చే ఏడాదిలో ఉత్తరాదికి వెళ్ళనుంది కీర్తి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.