ప్రారంభం కానున్న కీర్తి సురేష్‌ కొత్త చిత్రం

జాతీయ అవార్డు గ్రహిత ఉత్తమ నటి కీర్తి సురేష్‌ త్వరలోనే కార్తిక్‌ సుబ్బరాజు నిర్మాణంలో ఓ చిత్రం చేయనుంది. ఈ చిత్రానికి ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహించనున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ఇదొక భావోద్వేగంతో కూడిన థ్రిల్లర్‌ కథ నేపథ్యంలో తెరకెక్కనుందట. సినిమాకి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్‌ పలని పనిచేస్తున్నారు.ఇక ఈ మధ్యనే తెరపైకొచ్చిన ‘మన్మథుడు2’లో కీర్తి, నాగార్జునతో కలిసి నటించింది. మళయాళంలో మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌: అరబికడాలినేట్‌ సింహం’లో చేస్తుంది. హిందీలో అమిత్‌ శర్మ దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్‌ సరసన కీర్తి నటించనుంది. మొత్తం మీద కీర్తి ఈ సంవత్సరం చాలా బిజీగా ఉంటుందని ఈ ప్రాజెక్టులను చూస్తే అర్థమవుతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.