డిజిటల్‌లో విడుదల కానున్న కీర్తి ‘పెంగ్విన్‌’?

‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్, ఉత్తమ జాతీయనటిగా పేరుతెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులో ‘మన్మథుడు2’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించి సందడి చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రం ‘పెంగ్విన్‌’. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా థీయేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. మరీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకురావాలిని చిత్రబృందం తర్జనభర్జనలు పడగా చివరకు డైరక్టుగా, డిజిటల్‌ మీడియం ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమైయ్యారట. రజనీకాంత్‌ ‘పేట’ చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తిక్‌ సుబ్బరాజ్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల్లోనే ఆమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుందట. మొత్తం మీద కరోనా వైరస్‌ దెబ్బతో చాలా చిత్రాల విడుదలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో ప్రేక్షకులను నిరాశపరచకుండా డిజిటల్‌ మీడియం (ఓటీటీ) ద్వారా విడుదల చేయాలని పలువురు సినీ నిర్మాతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.