మహానటి కీర్తి సురేష్ పాత్రకు తగ్గట్లు మారిపోవడం అంటే ఆమె చాలా సులువైన పని. సినిమా అంటే అంత ఇష్టం. అందుకే కీర్తి సురేష్ సర్కారు వారి పాట చిత్రం కోసం కాస్త బరువు పెరిగిందట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమా ఈ నెల 26 నుంచి దుబాయ్‌లో షూటింగ్ జరుపుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనొ సమాచారం. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్,జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్ల్స్ ఫ్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజుతో పాటు భారీ తారాగణం నటించనుంది. ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీర్తి సురేష్ కరోనా లాక్డౌన్ సమయంలో పెంగ్విన్, మిస్ ఇండియా వంటి చిత్రాలతో డిజిటల్ మీడియం వేదికగా అలరించింది. ప్రస్తుతం కీర్తి నితిన్‌తో కలిసి రంగ్ దే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో రజనీకాంత్ సరసన అన్నాత్తే, మలయాళంలో మరక్కార్ చిత్రంలో నటిస్తోంది.