బ్యాంక్ ఉద్యోగిగా కీర్తి సురేష్‌!


‘మహానటి’ చిత్రంతో ఎనలేని పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్‌. ఈ మధ్యనే విడుదలైన ‘పెంగ్విన్’‌ చిత్రంలో ఓ బిడ్డకు తల్లిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఇందులో కీర్తి బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనుందని సమాచారం. చిత్రంలో మహేష్‌బాబు తల్లి బ్యాంకు అధికారిగా పనిచేస్తుందట. ఆమె తోటి బ్యాంకు ఉద్యోగిగా కీర్తి సురేష్‌ నటించనుంది. యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా వస్తోన్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రం కథ అంతా హైదరాబాద్‌లోని ఓ బ్యాంకు మోసానికి పాల్పడుతుంది. మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశం విడిచి యుకేకి వెళ్తాడట. చిత్ర కథంతా ఈ నేపథ్యంలో ఉండనుందట. ఈ మొత్తం విషయంలో బ్యాంకు అధికారి అయిన తన తల్లిని మహేష్‌ ఏలా కాపాడుకొన్నాడనేది మిగిలిన కథ. అయితే కీర్తి సురేష్‌ ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించిన దాఖలు లేవు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ మలయాళంలో ‘మరక్కర్‌: అరబికడాలింటే సింహం’, తమిళంలో రజనీకాంత్‌తో కలిసి ‘అణ్నాత్తే’ చిత్రంలో నటిస్తుంది. ఇక తెలుగులో మూడు చిత్రాల్లో ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌ దే’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.