అనుకున్న తేదీకే తెరపైకి కె.జి.ఎఫ్‌: చాఫ్టర్‌ 2’


యశ్‌, శ్రినిధి శెట్టి కలిసి నటిస్తున్న భారీ చిత్రం కేజీఎఫ్‌:చాఫ్టర్‌ 2. ప్రశాంత్‌ నీల దర్శకత్వంలో వహిస్తున్న ఈచిత్రం అనుకున్న తేదీకే ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అయితే లాక్‌డౌన్‌ సమయంలోనే చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్‌ పనులపై దృష్టిసారించారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేయాగానే 25 నుంచి 30 రోజుల చివరి షెడ్యూల్‌ అనుకుని అందులోనే పోరాట సన్నివేశాలతో పాటు అన్నింటిని ముగించేయాలని చస్తున్నారట. మొదట వచ్చిన కేజీఎఫ్‌: చాప్టర్‌ ఘనమైన విజయం సాధించి పెట్టింది. అందుకే రాబోయో ఈ సీక్వీల్‌ చిత్రంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలీవుడ్‌కి చెందిన సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌లు నటిస్తున్నారు. రవీనాటాండన్‌ ప్రధానమంత్రి పాత్రలో నటిస్తుంది. ఇంకా ఇందులో రావు రమేష్‌, వశిష్ట సింహా, అచ్యుత్‌ కుమార్‌, మాలవిక అవినాష్‌, టీఎస్‌ నాగభరణ తదితరులు నటిస్తున్నారు. హంబేళే ఫిల్మ్స పతాకంపై నిర్మితమౌతున్న సినిమాకి విజయ్‌ కిరాగండూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. కన్నడలోని కెఆర్జి స్టూడియోస్, హిందీలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఎఎ ఫిల్మ్స్, తమిళంలోని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ , తెలుగులో వారాహి చలన చిత్రం సంస్థలు పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.