కేజీఎఫ్‌2 విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు!

కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌ నటిస్తున్న సీక్వెల్‌ చిత్రం కె.జి.ఎఫ్‌: చాఫ్టర్‌ 2’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీపై రకారకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందానికి దగ్గరగా ఉన్న మూలాన్ని సంప్రదించగా అందుకు వాళ్లు స్పందిస్తూ..ప్రస్తుతం సినిమా విడుదల తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు కేవలం సినిమాను పూర్తి చేయడంపైనే దృష్టి సారించాం. అక్టోబర్‌ 15 తరువాత దేశవ్యాప్తంగా థియేటర్లు తెరువనున్నారు. దాంతో మాకు చిత్రం ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. అప్పుడు మాత్రమే చిత్రాన్ని విడుదల నిర్ణయిస్తామని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు చిత్రం క్రిస్మస్‌ లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటే చెప్పలేం. థియేటర్లు తెరుచుకొని ప్రేక్షకులు సౌకర్యవంతంగా ఉన్నారనే లేరా అనే దానిపై చిత్ర విడుదల తేదీ ఆధారపడి ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు నటుడు యష్‌ కూడా సినిమా విడుదలపై తొందరపడడం లేదు. అంతేకాదు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌తో పోరాట సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఏ సినిమా షూటింగ్‌ సెట్లోకి వెళ్లినట్లు కనిపించడం లేదు. అక్షయ్‌ కుమార్‌తో కలిసి పృథ్వీరాజ్‌ సినిమా చిత్రీకరణలో దీపావళి పండుగ తరువాత పాల్గొనే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేజీఎఫ్‌2లో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. హంబేళే ఫిల్మ్స పతాకంపై నిర్మితమౌతున్న సినిమాకి విజయ్‌ కిరాగండూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో రవీనా టాండన్‌,రావు రమేష్‌, వశిష్ట సింహా, అచ్యుత్‌ కుమార్‌, మాలవిక అవినాష్‌, టీఎస్‌ నాగభరణ తదితరులు నటిస్తున్నారు. చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేయనున్నారు. కన్నడలోని కెఆర్జి స్టూడియోస్, హిందీలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఎఎ ఫిల్మ్స్, తమిళంలోని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ , తెలుగులో వారాహి చలన చిత్రం సంస్థలు పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ లేకుంటే ఈ చిత్రం 13 అక్టోబర్ 2020న విడుదల కావాల్సి ఉంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.