బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఖయ్యామ్‌ ఇకలేరు

బాలీవుడ్‌ సంగీత దర్శకుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఖయ్యమ్‌. ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఖయ్యామ్‌ పూర్తిపేరు మహ్మద్‌ జహూర్‌ ఖయ్యామ్‌. 1947లో వచ్చిన ‘రోమియో అండ్‌ జూలియట్‌’ చిత్రంతో స్వరకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. దిలీప్‌ కుమార్, మీనా కుమారి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘పుట్‌పాత్‌’ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆపై ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఖయ్యామ్‌ చిత్రాల్లో కొన్ని ఆణిముత్యల్లాంటివి ఉన్నాయి. వాటిలో ‘ఉమ్రావ్‌ జాన్‌’, ‘కభీ కభీ’, ‘రజియా సుల్తాన్‌’, ‘దిల్‌-ఇ-నాదాన్‌’, ‘దర్ద్‌’లాంటివి ఉన్నాయి. నాటి అవిభక్త భారత్‌దేశంలోని పంజాబ్‌లోని నవన్‌షహర్‌ జిల్లా రహోన్‌లో ఫిబ్రవరి 18, 1927న జన్మించారు. గాయని జగ్జిత్‌ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. తన జీవిత కాలంలో ఎన్నో సినీ అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం ఆయనను 2011లో ‘పద్మభూషణ్‌’ అవార్డుతో సత్కరించింది. ముంబైలో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.