రవితేజ కథానాయకుడుగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ నాయికలు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రముఖ నటుడు అర్జున్ ఎంపికయ్యారు. చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు తమిళ, తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు అర్జున్. మరోసారి నెగెటివ్ షేడ్ చూపించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ- అర్జున్ కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ‘వీర’ తర్వాత రమేష్ వర్మ, రవితేజ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.