నేనే కాదు.. అందరూ ఇంతేనేమో!
మీ సినిమాను తెరపై చూసుకుంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తప్పొప్పుల్ని విశ్లేషించుకుంటారా?


కియారా అడ్వాణీ
: తప్పకుండా విశ్లేషించుకుంటాను. నా దృష్టి నేను చేస్తున్న తప్పుల మీదే ఉంటుంది. నేను సినిమా చూస్తుంటే తెరపై నాకు నేను తప్ప మరే పాత్రా కనిపించదు. ‘అరె.. ఈ సీన్‌లో బొమ్మలా నిలబడిపోయానేంటి?’, ‘ఇలా చేయాల్సింది కదా..’ అనుకుంటూ ఉంటాను. అందుకే నా సినిమా చూస్తుప్పుడు పూర్తిగా ఆస్వాదించలేను. నేనే కాదు. అందరూ ఇంతేనేమో..? మన గురించి మనకు తప్ప ఇంకెవ్వరికీ సరిగా తెలీదు. అలానే మన తప్పుల్ని మనం తప్ప ఇంకెవరూ కనిపెట్టలేరు. కానీ ఒప్పుకోలేం. నేనలా కాదు. దేన్నయినా సానుకూల దృక్పథంతో తీసుకుంటా. నా స్నేహితులంతా పొగుడుతున్నా, నా తప్పొప్పుల్ని సరిగ్గా అంచనా వేయగలను. అదే నా అతి పెద్ద బలమనుకుంటా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.